హైదరాబాద్: 28°C
వార్తలు

నిమజ్జనంలో విషాదం.. ఓ వ్యక్తి దుర్మరణం

TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం నెలకొంది. నిమజ్జనం చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1167 వద్ద ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.