హైదరాబాద్: 28°C
వార్తలు

ఇథనాల్ వల్లే మొక్కజొన్న రేటు పెరిగింది: గడ్కరీ

ఇథనాల్ ఉత్పత్తి వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమయ్యాక మొక్కజొన్న క్వింటాల్ ధర రూ.1200 నుంచి రూ.2,600కు చేరిందని చెప్పారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ కలిగిన ఇంజిన్లు నూరు శాతం ఇథనాల్‌తో నడుస్తాయని తెలిపారు. దేశ అవసరాలకు అవసరమైన చమురు దిగుమతులను తగ్గించడానికే ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.