హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వర్షం తగ్గినా జలదిగ్బంధంలోనే పాఠశాల

E.G: ద్వారపూడి వేములపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ప్రధాన రహదారులు, నడిచే మార్గాలు సైతం నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు గుంతలు, డ్రైనేజీల్లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలన్నారు.