ఛత్తీస్‌గఢ్ బాలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-30పై ఆగి ఉన్న డీజే వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి


