హైదరాబాద్: 28°C
వార్తలు

లూథియానాలో కారు బీభత్సం

పంజాబ్ లూథియానాలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు మొత్తం 6 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ బైకర్ గాల్లో ఎగిరిపడ్డారు. నిందితుడు మద్యం మత్తులో కారు నడిపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.