హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ పాలన దేశానికి అసలైన బలం: అమిత్ షా

ప్రధాని మోదీ నాయకత్వంలోని స్థిరమైన పాలన దేశానికి అసలైన బలమని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. మూడోసారి ప్రధాని ఆయిన మోదీ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా దూరదృష్టితో విధానాలను రూపొందిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా ఆ విధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి చూపిస్తున్నారని కొనియాడారు. అలాగే సరికొత్త పారిశ్రామిక సంస్కరణలను అమలు చేస్తున్నారని తెలిపారు.