హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాం: అమిత్ షా

ఒకప్పుడు యూపీలో నేరగాళ్లు, మాఫియా రాజ్యమేలేదని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. యోగీ సీఎం అయినప్పటి నుంచి రాష్టవ్యాప్తంగా మాఫియా నెట్‌వర్క్ తుడిచిపెట్టుకుపోయిందని కొనియాడారు. అలాగే ఆయన పాలనలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన సురక్షిత ప్రాంతంగా రాష్ట్రం అవతరించిందని ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టం కావడంతోనే పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు.