యూపీఐ లావాదేవీలపై MDR విధింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి నిర్మలమ్మ ఖండించారు. MDR రుసుములు రూ.2వేల కన్నా అధికంగా ఉన్న యూపీఐ లావాదేవీలకే వర్తిస్తాయని తెలిపారు. వీటితో ప్రభుత్వ ఖజానాకు వచ్చేది ఏమీ ఉండదని తెలిపారు. యూపీఐ సేవలందిస్తున్న పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు, మర్చంట్ బ్యాంకులు, అందులోని భాగస్వామ్య పక్షాలకే ఈ మొత్తం చేరుతుందని వెల్లడించారు.
వార్తలు
ప్రభుత్వానికి రూపాయి రాదు: నిర్మలమ్మ


