హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీపై కేసు నమోదుకు సుప్రీంలో పిటిషన్

CEC జ్ఞానేశ్ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈసీలో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఫారమ్ 6లో అక్రమ మార్పులు చేశారని, ఇతర కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోలేదని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఓటర్లు తమ హక్కును కోల్పోయారని, కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్సీని కోరారు.