హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే ట్రాక్‌లపైకి దూసుకెళ్లిన కారు!

ముంబైలో 17 ఏళ్ల యువకుడు నడుపుతున్న కారు కొండపై నుంచి జారిపడి బేలాపూర్‌–ఉరాన్‌ రైల్వే ట్రాక్‌లపైకి దూసుకెళ్లింది. పార్సిక్‌ టన్నెల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటన కారణంగా ఓ లోకల్‌ రైలును నిలిపివేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.