హైదరాబాద్: 28°C
వార్తలు

రేప్ కేసుల్లో శిక్షలు తక్కువ.. జాప్యం ఎక్కువ!

బాలికలపై అత్యాచార కేసులు పెరుగుతున్నా, వారికి న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోంది. 2015-24 మధ్య కాలంలో సగటున నిందితులకు శిక్ష పడుతున్న కేసుల రేటు కేవలం 32.3 శాతమే. అదే సమయంలో 89.5% కేసులు కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉండిపోయాయి. కేవలం 10.5% కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. పోక్సో కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులున్నా బాధితులకు సత్వర న్యాయం అందడం లేదని NCRB నివేదికలో తేలింది.