ASR: భారీ వర్షాల నేపథ్యంలో కొయ్యూరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వలసంపేట సమీపంలో ఉన్న గాదెగుమ్మి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో, ఉధృతి తగ్గేవరకూ ప్రజలు, పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లవద్దని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ శుక్రవారం సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు, పర్యాటకులు రావద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉధృతంగా గాదెగుమ్మి జలపాతం.. పర్యాటకులకు విజ్ఞప్తి


