ASR: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బీ.వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర సమయంలో పోలీసు సహాయం పొందాలని, సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా భద్రతపై డీఎస్పీ అవగాహన


