హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోటాడ ఆనకట్ట పరిశీలన.. రీడింగ్ వచ్చాకే గేట్లు ఎత్తుతాం

AKP: తోటాడ ఆనకట్టను శుక్రవారం అనకాపల్లి ఆవ కాలువ ఛైర్మన్ ఆడారి ఆనంద సన్యాసినాయుడు పరిశీలించారు. వర్షాలతో ఆవ కాలువ నిండి ప్రవహిస్తుండటం వరి నాట్లకు ఎంతో ప్రయోజనకరమని ఆయన తెలిపారు. ఎగువ ప్రాంత రైతులు ఒత్తిడి తెచ్చినా నిబంధనల ప్రకారం రీడింగ్ పూర్తయ్యాకే గేట్లు ఎత్తుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజేష్, రైతులు పాల్గొన్నారు.