TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లు నిండగా, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. నిన్న మొత్తం 67,534 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,411 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అన్నప్రసాదాన్ని 2.05 లక్షల మంది స్వీకరించారు. హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శుక్రవారం: నేటి తిరుమల సమాచారం


