బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో నిందితుల గురించి విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 2024లో నమోదైన కేసుల్లో 97 శాతం మంది నిందితులు బాలికలకు తెలిసిన వారే ఉన్నారు. కేవలం 3.3% కేసుల్లో మాత్రమే గుర్తుతెలియని వ్యక్తులున్నారు. స్నేహితులు లేదా పెళ్లి పేరుతో మోసం చేసినవారు 50.9% ఉండగా, బంధువులు, ఇరుగుపొరుగు వారు 37.6%, కుటుంబ సభ్యులు 8.2% ఉన్నట్లు NCRB నివేదికలో తేలింది.
వార్తలు
చిన్నారులపై రేప్.. తెలిసిన వారితోనే డేంజర్!


