పార్వతీపురం:ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27న జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 27న బ్యాంకులు పనిచేస్తాయి'


