బాపట్ల జిల్లా పరిషత్ నూతన కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి జడ్పీ విభజనతో బాపట్ల జడ్పీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కార్యాలయంలో పూజలు నిర్వహించి కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. పల్లెల అభివృద్ధికి ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం


