VZM: ఎల్ కోట, రంగరాయపురం గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన చెలికాని చిన్న అప్పారావుకు చెందిన పెంకిటిల్లు భారీ వర్షాల ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తక్షణ సహాయంగా రూ. 5,000 నగదుతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఎమ్మెల్యే తక్షణ సాయం


