ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్లిన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాక్ ఉప ప్రధాని ఫువాద్ హుస్సేన్‌తో సమావేశమయ్యారు. యూఎన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక చర్చలు జరిపారు. ఇరు దేశాలకు ఈ భేటీ ఎంతో కీలకం కానుంది.
వార్తలు
ఇరాక్ ఉప ప్రధానితో జైశంకర్ భేటీ


