హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్ష బీభత్సానికి కూలిన ఇల్లు

ELR: బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం ఎస్సీ పేటకు చెందిన పూసంపూడి దుర్గమ్మకి చెందిన తాటాకు ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా కూలిపోయింది. నిలువ నీడ కోల్పోయిన బాధితురాలు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వపరంగా తమకు నూతన గృహం మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు.