ప్రకాశం: పామూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో వందేమాతరం గీతానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వందేమాతరం గీతానికి 150 వసంతాలు'


