సిక్కింలోని రింబి ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా బురద, రాళ్లు, శిథిలాలు ఒక్కసారిగా దిగువకు దూసుకురావడంతో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతంలోని 30కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కళ్లముందే బురద ఉద్ధృతికి ఇళ్లు కుప్పకూలిపోతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ బీభత్సంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వార్తలు
ప్రకృతి ప్రకోపం.. కొండచరియలు విరిగిపడి బీభత్సం


