PPM: కురుపాం మండలం పుతికవలస,కాటందొరవలస గ్రామాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలుల ప్రభావంతో అరటి, జొన్న పంటలు దెబ్బతిన్నాయి. సుమారు100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. గాలుల తీవ్రతకు అరటి చెట్లు నేలకొరిగి, జొన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గాలివాన బీభత్సం.. 100 ఎకరాల్లో పంట నష్టం


