హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్రో కీర్తిపతాకను ఎగరేసిన మహనీయుడు

ISRO కీర్తిని దశదిశలా చాటిన మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ జయంతి నేడు. విక్రమ్ సారాభాయ్ తర్వాత ఇస్రో బాధ్యతలు చేపట్టి భారత అంతరిక్ష రంగానికి బలమైన పునాదులు వేశారు. ప్రయోగం విఫలమైతే తాను బాధ్యత వహించి, విజయం సాధిస్తే శాస్త్రవేత్తలకు క్రెడిట్ ఇచ్చే గొప్ప నాయకుడు ఆయన. ఆయన సేవలకు గుర్తుగానే శ్రీహరికోట కేంద్రానికి 'సతీష్ ధావన్ స్పేస్ సెంటర్'గా నామకరణం చేశారు.