దేశంలో బాలికలపై లైంగిక దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) డేటా ప్రకారం పదేళ్లలో బాలికలపై రేప్ కేసులు 4 రెట్లు పెరిగాయి. 2015లో 10,934 కేసులు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 43,675కు చేరింది. చట్టాలు కఠినతరం చేసినప్పటికీ చిన్నారులపై అకృత్యాలు ఆగడం లేదు. బేటీ బచావో అంటున్నా, వారికి కనీస భద్రత కరవవుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వార్తలు
4 రెట్లు పెరిగిన బాలికలపై అకృత్యాలు


