పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో భారీగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల్లోనే 50.30 టన్నుల చెత్త పోగైనట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. గత మూడేళ్లలో ఏ ఏడాది లేనంతగా చెత్త పేరుకుపోయింది. ఇందులో 20 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండటం గమనార్హం. సున్నితమైన హిమాలయ పర్యావరణానికి ఇది తీవ్ర ముప్పు అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
వార్తలు
రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్‌లో చెత్తాచెదారం


