హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ మాఫియా.. రూ.78.5 కోట్ల ఆస్తులు సీజ్

యూపీలో డ్రగ్స్ మాఫియాపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. స్మగ్లర్ల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఆస్తులను జప్తు చేస్తోంది. ఈ ఏడాది SEP 23 వరకు 69 కేసుల్లో రూ.78.5 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. 2029 నాటికి యూపీని 'డ్రగ్ ఫ్రీ స్టేట్‌'గా మార్చే దిశగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌(ANTF)తో కలిసి దాడులు ముమ్మరం చేసినట్లు డీజీపీ రాజీవ్ కృష్ణ తెలిపారు.