హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట

TG: బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ఈ ఉదయం జరగనుంది. 33 ఏళ్లుగా ఈ వేలం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది వేలం పాట కోసం 8 మంది సభ్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. 1994లో రూ.450తో లడ్డూ వేలం పాట ప్రారంభంకాగా.. గతేడాది రికార్డు స్థాయిలో లడ్డూ రూ.35 లక్షలు పలికింది. 2024లో రూ.30 లక్షల ఒక వెయ్యి పలికింది. దీంతో ఇవాళ లడ్డూ ఎంత ధర పలుకుతుందో అనే ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది.