హైదరాబాద్: 28°C
వార్తలు

OCT-1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

AP: బ్యాంకుల సమ్మె ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అక్టోబర్-1 ఉదయం బ్యాంకుల నుంచి డబ్బు విత్‌డ్రా చేసి.. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారుల కోసం.. రూ.2,692.34 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు తెలిపారు.