హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళే జీతాలు, పింఛన్లు జమ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవాళే జీతాలు జమ కానున్నాయి. ఈనెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో నెలాఖరులో జీతాల చెల్లింపులకు ఆటంకం కలగకూడదని ఆర్థిక మంత్రిత్వశాఖ భావించింది. అందుకే ఐదు రోజుల ముందే.. అంటే ఇవాళే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.