హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తీవ్ర వాయుగుండం తీరం దాటినా APలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో APలోని అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ప.గోదావరి, తూ.గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. అలాగే గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణలోని HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ఇచ్చారు.