హైదరాబాద్: 28°C
వార్తలు

నేడే ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జనం

TG: ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి 12 గంటల తర్వాత పండితులు కలశపూజ నిర్వహించారు. కాసేపట్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల్లోపే నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 69 అడుగుల గణేశుని నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్‌ను సిద్ధం చేశారు.