AP: రాజధాని అమరావతిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. YCP హయాంలో తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లును సవాలు చేస్తూ రాజధాని రైతులు ఈ పిటిషన్ వేశారు. దీనిపై అప్పట్లో జస్టిస్ జీకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి, రాజధాని అమరావతే అని స్పష్టమైన తీర్పు ఇచ్చి.. తీర్పు అమలుకు కంటిన్యూస్ మాండమస్ విధించింది. ఇవాళ దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.
వార్తలు
రాజధాని అమరావతిపై నేడు హైకోర్టులో విచారణ


