హైదరాబాద్: 28°C
వార్తలు

గణేష్ శోభాయాత్రలో 26కు పైగా షీ టీమ్స్

TG: వినాయక నిమజ్జన శోభాయాత్రలో మహిళల రక్షణ కోసం 26కు పైగా షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఉత్సవాల్లో, శోభాయాత్రలో అమ్మాయిలను, మహిళలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తే భయపడకుండా వెంటనే స్పందించాలని కోరింది. బాధితులు తక్షణమే డయల్ 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, బాధ్యులపై నిమిషాల వ్యవధిలో కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.