హైదరాబాద్: 28°C
వార్తలు

'భారత్‌-అమెరికా ఒప్పందం దాదాపు పూర్తైంది'

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తైందని చెప్పారు. భారత ఎగుమతిదారులకు పోటీ దేశాలతో పోలిస్తే టారిఫ్ పరంగా ప్రయోజనం కల్పించే అంశంపై రెండు దేశాలు ఇంకా కసరత్తు చేస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థను ఖరారు చేసిన వెంటనే ఒప్పందం అమలుకు లైన్ క్లియర్ అవుతుందని వెల్లడించారు.