AP: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల గోదావరి నదికి రేపటి నుంచి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. రేపు ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో గోదావరికి వరద ఉద్ధృతి మరింత పెరుగుతుందని.. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
గోదావరికి వరద.. లంక గ్రామాలకు హెచ్చరిక


