AP: YCP హయాంలో జరిగిన మద్యం కుంభకోణం చాలా పెద్దదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. YCP అమ్మిన నాసిరకం మద్యం తాగి వేలాది మంది మరణించారని ఆరోపించారు. YCP హయాంలో రూ.1.30 లక్షల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 600 కోట్లకే డిజిటల్ లావాదేవీలు జరిగాయని.. అవినీతికి ఈ లెక్కలే నిదర్శనమని చెప్పారు. ఈ కేసులో ED దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు YCP నేతలు కుట్ర చేస్తున్నారన్నారు.
వార్తలు
YCP మద్యం అవినీతికి అంతు లేదు: నాదెండ్ల


