హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన గ్రామాలవైపు పెద్దపులి కదలికలు

AP: పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. బోలగొండలో ఆవు దూడపై పెద్దపులి దాడి చేసింది. తర్వాత అది గిరిజన గ్రామాలవైపు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాళ్లపాలెం, భీమవరం, పెద్దకొండ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మర్రిపాలెంలో నాలుగు పశువులపై పెద్దపులి దాడి చేసి చంపేసింది.