హైదరాబాద్: 28°C
వార్తలు

పలు సమస్యలపై మంత్రిని కలిసిన నూనెపల్లె వాసులు

నంద్యాల క్యాంపు కార్యాలయంలో నూనెపల్లె ప్రాంత ప్రజలు, నేతలు మంత్రి ఎన్.ఎమ్.డీ. ఫరూక్‌ను కలసి తమ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్, అండర్‌పాస్, బ్రిడ్జి విస్తరణ సమస్యలను విన్నవించారు. బాధితుల వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి, నూనెపల్లె అండర్‌పాస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నూనెపల్లె అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.