హైదరాబాద్: 28°C
వార్తలు

తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

PLD: రొంపిచర్ల మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ బీ. నిర్మల తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సమస్యలు ఎదురైతే 7075555397కు సమాచారం ఇవ్వాలని కోరారు.