హైదరాబాద్: 28°C
వార్తలు

తీవ్ర వాయుగుండం.. 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ప్రకాశం: తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మార్కాపురం కలెక్టరేట్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత గురువారం తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 9248702556, 9248702557 నంబర్లను సంప్రదించాలని కోరారు.