ఎన్డీయే హయాంలో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పటికే ప్రజల ఓటు హక్కును కాలరాశారని మండిపడ్డారు. ఇప్పుడు చట్టాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ బాధ్యత అని తెలిపారు. ఓటింగ్ వ్యవస్థను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారని రాహుల్ ఆరోపించారు.
వార్తలు
దేశానికి వ్యతిరేకంగా సీఈసీ పని చేస్తున్నారు: రాహుల్


