హైదరాబాద్: 28°C
వార్తలు

కోసిగిలో రేపు కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల వేదిక

KRNL: కోసిగిలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పర్యటించనున్నారు. శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందే అవకాశం కల్పించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గీతా ప్రియదర్శిని తెలిపారు.