హైదరాబాద్: 28°C
వార్తలు

వినీత్ మనోచా హత్య కేసులో కీలక పరిణామం

యూపీకి చెందిన వ్యాపారవేత్త వినీత్ మనోచా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కిరాయి హంతకుడితో తండ్రిని చంపించినట్లు కుమారుడు సుబ్రత్ మనోచా అంగీకరించాడు. ఈ హత్యతో తన భార్యకు సంబంధం లేదని తెలిపాడు. అయితే, వినీత్ మనోచాకు వేరే మహిళతో సంబంధం ఉంది. ఆమె పిల్లలకు ఆస్తిని రాసేస్తాడనే ఉద్దేశంతో తండ్రిని హత్య చేసేందుకు సుబ్రత్ పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.