హైదరాబాద్: 28°C
వార్తలు

జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు!

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (సీఈసీ)పై విపక్షాలు అభిశంసన తీర్మానం నోటీసును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇతర ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ సంప్రదించినట్లు సమాచారం. రానున్న రెండు వారాల్లో ఈ నోటీసులను సమర్పిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, 'సర్' నిర్ణయాలపై ఎన్నికల కమిషన్‌లో భిన్నాభిప్రాయాల అంశం రాజకీయ దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే.