హైదరాబాద్: 28°C
వార్తలు

మరో ఘోరం.. నడిరోడ్డుపై బాలికను వేధించి

బీహార్‌లో మైనర్లపై వరుస వేధింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న జముయీ జిల్లాలో ఇద్దరు టీనేజర్లపై కొందరు దుండగులు దాడి చేసిన వీడియో వైరల్ కాగా.. తాజాగా సమస్తీపుర్ జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ టీనేజీ అమ్మాయి, అబ్బాయి కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు వారిని అడ్డగించి.. అమ్మాయిని అసభ్యకరంగా తాకారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.