హైదరాబాద్: 28°C
వార్తలు

అదానీ కీలక ప్రకటన

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. కోల్‌కతాలో 2,000 పడకల ఆసుపత్రి శంకుస్థాపనలో పాల్గొన్న సందర్భంగా అదానీ ఈ ప్రకటన చేశారు. పవర్ జనరేషన్, లాజిస్టిక్స్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు, రోడ్లు, పోర్టులు తదితర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.