హైదరాబాద్: 28°C
వార్తలు

శబరిమల ఆలయంలో బంగారు కిరీటం గల్లంతు

శబరిమల ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో బంగారు కిరీటం గల్లంతు కావటం మరోసారి కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు 2012లో ఈ కిరీటాన్ని స్వామి వారికి సమర్పించాడు. 445.78 గ్రాముల బరువుతో ఆ కిరీటాన్ని తయారు చేయించాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉంచిన నకిలీ కిరీటం బరువు 240 గ్రాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.