హైదరాబాద్: 28°C
వార్తలు

న్యాయవిద్యతో బీసీఐకి ఏం పని?: సుప్రీం

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కు న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలను నియంత్రించే అధికారం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయశాస్త్ర పట్టభద్రులు న్యాయవాదులుగా లైసెన్సు పొందాకే ఒక నియంత్రణ సంస్థగా బీసీఐ పాత్ర మొదలవుతుందని పేర్కొంది. బీసీఐ సభ్యులకు న్యాయ విద్యను గురించి ఏం తెలుసని, ఆ విషయాలను పరిశీలించేందుకు న్యాయ కోవిదులున్నారని వెల్లడించింది.